home page

మునుగోడు కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి

 ముకుల్ వాస్నిక్ ప్రకటన 
 | 
sravanthi

మునుగోడు  కాంగ్రెస్ అభ్యర్థి స్రవంతి  ముకుల్ వాస్నిక్ ప్రకటన 

హైద‌రాబాద్ : మునుగోడు కాంగ్రెస్ అభ్య‌ర్థిగా పాల్వాయి స్ర‌వంతి పేరును కాంగ్రెస్ అధిష్టానం ఖ‌రారు చేసింది. ఈ మేర‌కు ఆ పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ ముకుల్ వాస్నిక్.. పాల్వాయి స్ర‌వంతి పేరును అధికారికంగా ప్ర‌క‌టించారు. 2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో మునుగోడు నుంచి పోటీ చేసిన పాల్వాయి స్ర‌వంతి టీఆర్ఎస్ అభ్య‌ర్థిపై ఓట‌మి పాల‌య్యారు. 2018 ఎన్నిక‌ల్లో ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ త‌ర‌పున కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. ఇటీవ‌ల రాజ‌గోపాల్ రెడ్డి త‌న ఎమ్మెల్యే ప‌ద‌వికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మునుగోడు నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక అనివార్య‌మైంది. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ పాల్వాయి గోవ‌ర్ధ‌న్ రెడ్డి కుమార్తెనే పాల్వాయి స్ర‌వంతి.
మునుగోడు లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి  చేయడంవల్ల ఉప ఎన్నిక జరగున్నది. రాజగోపాల్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థిని ఇంకా నిర్ణయించలేదు . కాంగ్రెస్ పార్టీ తన అభ్యర్థిని ప్రకటించినందువల్ల టిఆర్ఎస్ కూడా పార్టీ అభ్యర్థి పేరు పాటించాల్సి వుంది