నవంబర్ 3 మునుగోడు ఉపఎన్నిక
ఈనెల మూడున నోటిఫికేషన్ జారీ
Updated: Oct 3, 2022, 12:36 IST
| మునుగోడులో ముక్కోణపు పోటీ
తెలంగాణలోని మునుగోడు నియోజకవర్గానికి నవంబర్ మూడు ఉప ఎన్నిక జరుగుతుంది . అక్టోబర్ ఏడున ఈ మేరకు నోటిఫికేషన్ జారీ చేస్తారు .భారత ఎన్నికల సంఘం సోమవారం జారీ చేసిన ప్రకటన ప్రకారం ఏడు రాష్ర్టాల్లో ఏడు ఉప ఎన్నికలు జరగనున్నాయి . కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా కారణంగా మునుగోడులో ఉప ఎన్నిక అనివార్యమైంది .కోమటిరెడ్డి బీజేపీలో చేరి బిజెపి అభ్యర్థిగా పోటీ చేయనున్నారు .కాంగ్రెస్ టీఆర్ఎస్ కూడా రంగంలోకి వస్తున్నాయి .ఈ ముక్కోణపు పోటీలో టీఆర్ఎస్ విజేతగా నిలుస్తుందో? కాంగ్రెస్ గెలుస్తుందా? బీజేపీ బోణీ దక్కించుకుంటుందా? అన్నది చూడాలి .