యూపీలో మరో మసీదు వివాదం
జ్ఞానవాపి , శ్రీకృష్ణ జన్మభూమి తర్వాత కొత్త వివాదం
May 23, 2022, 03:10 IST
| హిందూ మతాభిమానులే ఈ చర్యలకు మూలం
లక్నో, మే 22: ఓవైపు ఉత్తరప్రదేశ్‌లో వారణాసిలోని జ్ఞాన్‌వాపీ, మథురలోని షాహీ ఈద్గా మసీదుకు సంబంధించి వివాదాలు కొనసాగుతున్న నేపథ్యంలో హిందూత్వ సంస్థలు మరో వివాదానికి తెరలేపాయి.
ఈసారి లక్నోలోని చారిత్రక 'టీలే వాలీ మసీదు'ను కేంద్రంగా చేసుకున్నాయి.
ఇది వాస్తవానికి లక్ష్మణుడి భూమి అని హిందూ మహాసభ వాదిస్తున్నది. ఆదివారం మసీదు వరకు ర్యాలీ చేపట్టి, అనంతరం అక్కడ హనుమాన్ చాలీసా పఠనం నిర్వహించ తలపెట్టింది. అయితే ఈ మార్చ్‌ను అడ్డుకున్న పోలీసులు, హిందూ మహాసభ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రిషి త్రివేదిని అదుపులోకి తీసుకున్నారు. అవధ్ చరిత్రకారుల ప్రకారం.. ఈ టీలే వాలీ మసీదును 16వ శతాబ్దంలో నిర్మించారు.