టీడీపీ నేత సీకే బాబు ఇంట్లో ఎన్నికల స్క్వాడ్ సోదాలు!

  • వోటర్లకు డబ్బు పంచ డానికే మద్యం, నగదు ఉన్నట్లు సమాచారం
  • సీకే బాబు ఇంట్లో తనిఖీలు చేపట్టిన పోలీసులు అధికారులు,
  • అనంతపురంలో జేసీ కాలేజీలో ఇప్పటికే తనిఖీల
  • ఏపీలో ఎన్ని కల దృష్ట్యా ఈసీ తనికీలు ముమ్మరం

 వోటర్లకు డబ్బు పంచ డానికే మద్యం, నగదు ఉన్నట్లు సమాచారం మేరకు ఎన్నికల అధికారులు సోదాలు ముమ్మరం చేశారు.  ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో మరో టీడీపీ నేత ఇంట్లో ఎన్నికల అధికారులు సోదాలు నిర్వహించారు. చిత్తూరు టీడీపీ నేత సీకే బాబు ఇంట్లో ఈరోజు ఎన్నికల స్క్వాడ్ అధికారులు, పోలీసులు తనిఖీలు చేశారు. చిత్తూరు, గంగాధరనెల్లూరు, పూతలపట్టులో పంచడానికి నగదు, మద్యాన్ని నిల్వ ఉంచినట్లు అధికారులుకు సమాచారం అందింది. దీంతో రంగంలోకి దిగిన ఎన్నికల స్క్వాడ్ అధికారులు పోలీసుల సాయంతో సోదాలు చేపట్టారు.ఒకటో పట్టణ సీఐ శ్రీధర్‌, ఎలక్షన్‌ స్క్వాడ్‌ అధికారి పార్థసారథితో పాటు పోలీసులు సీకే బాబు ఇంట్లో తనిఖీలు చేశారు. కాగా, దాదాపు అర గంట పాటు సాగిన ఈ తనిఖీల్లో ఎలాంటి నగదు, మద్యం లభించలేదు. దీంతో ఎన్నికల స్క్వాడ్ అధికారులు, పోలీసులు వెనుకదిగిగారు. ఇటీవల టీడీపీ అనంతపురం నేత జేసీ దివాకర్ రెడ్డికి చెందిన ఓ కాలేజీలో కూడా పోలీసులు సోదాలు జరిపారు.