టీఆర్ఎస్ భవన్‌లో వెల్లువెత్తిన సంబురాలు

హైదరాబాద్: హుజూర్‌నగర్ ఉపఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంతో
టీఆర్ఎస్ భవన్‌లో సంబురాలు మిన్నంటాయి .
కార్యకర్తలు పెద్ద సంఖ్యలో టీఆర్ఎస్ భవన్‌కు చేరుకుని సంబురాలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ ఎమ్మెల్సీ షంబీపుర్ రాజు ఏబీఎన్ మాట్లాడుతూ తెలంగాణలో ఏ ఎన్నికలు వచ్చినా టీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ సమాజమంతా పట్టం కడుతుందన్నారు. ఏ పార్టీ, ఏ ప్రభుత్వం చేయనటువంటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కేసీఆర్ చేస్తున్నారని కొనియాడారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్, రైతుబంధు, రైతు బీమా, పెన్షన్లు, కల్యాణలక్ష్మీ, కేసీఆర్ కిట్లు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ లాంటి పథకాలు ప్రవేశపెట్టారని, రాష్ట్రంలో రైతులు సంతోషంగా ఉన్నారని షంబీపుర్ రాజు పేర్కొన్నారు.