టిక్‌ టాక్‌కు మధురై బెంచ్ బ్రేకులు 

 

 

హైలైట్స్

  • టిక్ టాక్‌కు చిన్నారులు, యువత బానిసలవుతున్నారు
  • యాప్‌పై నిషేధం విధించాలని ఆదేశించిన హైకోర్టు
  • తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేసిన హైకోర్టు

స్మార్ట్ ఫోన్లు చిన్నారుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయ్.ఎవరింట్లో చూసినా పిల్లలు సెల్ ఫోన్లో గేమ్స్ ఆడుతూ కనిపిస్తుంటారు.  చిన్నారుల సరదాకు ఫోన్లు ఇస్తున్న తల్లిదండ్రులకు ఊహించని ప్రమాదం ముంచుకొస్తోంది .ఇటీవల కొన్ని రకాల గేమ్స్ చిన్నారులకు నిద్రపట్టనివ్వడంలేదు. ఎపుడుచుసిన ఫోన్లో ఎదో గేమ్స్ఆడుతూ కన్పిస్తుంటారు .,పెద్దలు ఇంట్లో ఏ పని చెప్పిన పట్టించుకోరు. . చదువులను పక్కనబెట్టేస్తుంటారు.  దీనికి తోడు కొత్తకొత్త గేమ్స్ పిల్లలు ఆడుతూ ప్రాణాలమీదికి తెచుకుంటుండడం తో ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి సంఘటనలు దేశంలో అనేకం చోటు చేసుకుంటున్నాయి. ఎంతవరకంటే పిల్లలు చేయిదాటే వరకు వారఏమి ఆడుతున్నారో తెలియకపోవడం , ప్రాణాలు పోయేవరకు ఏవైకంట పడకపోవడం ఆందోళన కరంగా మారింది.

. ఈ పిచ్చి చాలదన్నట్లు టిక్ టాక్ పేరుతో కొత్త పిచ్చి యువతు, చిన్నారులకు పట్టుకుంటోంది. టిక్ టాక్ యాప్‌కు బానిసలై పిచ్చి, పిచ్చి వీడియోలతో పిల్లలు, యువత పెడదారి పడుతోంది. ఈ టిక్ టాక్ దూకుడుకు  మధురై బెంచ్ బ్రేకులు వేసింది. తమిళనాడులో టిక్ టాక్ యాప్‌ను నిషేధించాలని ఆదేశించింది.
టిక్ టాక్ యాప్‌పై నిషేధం విధించాలని దాఖలైన పిటిషన్‌పై మధురై బెంచ్ విచారణ జరిపింది. తమిళనాడులో చిన్నారులు టిక్ టాక్ యాప్‌కు బానిసలుగా మారుతున్నారని.. ఈ యాప్ పిల్లల ఆలోచనా విధానం, మానసిక స్థితిపై ప్రభావంతో చూపుతోందని అభిప్రాయపడింది. డివిజన్ బెంచ్‌లో ఉన్న జస్టిస్ ఎస్.‌ఎస్ సుందరం మీడియా సంస్థలకు కూడా కొన్ని సూచనలు చేశారు.

టిక్ టాక్ వీడియోలను ప్రసారం చేయొద్దని జస్టిస్ సుందరం మీడియా సంస్థలకు సూచించారు. ఆన్‌లైన్ ప్రైవసీ ప్రొటెక్షన్ యాక్ట్‌ తీసుకొచ్చే అంశంపై స్పందించాలని కేంద్రాన్ని కోరారు. యువత, పిల్లలు ఈ టిక్ టాక్ యాప్‌కు బానిసలుగా మారుతున్నారని అభిప్రాయపడ్డారు. వారి భవిష్యత్ నాశనం అవుతుందని.. అందుకే ఈ నిర్ణయమంటున్నారు. ఈ పిటిషన్‌పై తదుపరి విచారణ ఏప్రిల్ 16కు వాయిదా వేసింది.

ఫిబ్రవరిలో టిక్ టాక్‌పై నిషేధం విధించాలని తమిళనాడు ఐటీ మంత్రి కేంద్రాన్ని కోరారు. యాప్‌‌ను నిషేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అసెంబ్లీలో తెలిపారు. హింసను ప్రేరేపించే సంభాషణలు యాప్‌లో ఉన్నాయని.. రాజకీయ నేతలకు సంబంధించిన ప్రసంగాలను పోస్టు చేస్తున్నారని గుర్తు చేశారు. వివాదాస్పద కామెంట్లు చేస్తూ వీడియోలు పోస్టు చేస్తున్నారంటోంది తమిళనాడు సర్కార్.