జిల్లా వ్యాప్తంగా స్వచ్చందంగా జనతా కర్ఫ్యూ ::

విశాఖ పట్నం: మార్చి 22 : విశాఖ జిల్లాలో కరో నా వైరస్ వ్యాప్తీ కట్టడి కోసం..సకలం..స్వచ్ఛంద బంద్ తో విజయవంతంగా, సంపూర్ణంగా కొనసాగుతున్న..జనతా కర్ఫ్యూ ..

ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపుకు అనుగుణంగా విశాఖపట్నం జిల్లాలో కట్టుదిట్టంగా, సంపూర్ణంగా కొనసాగుతున్న జనతా కర్ఫ్యూ ..అత్యవసర సేవలు తప్ప …సకలం..స్వచ్చంధ కర్ఫ్యూ.. డిపోల్లోనే ఆగిపోయిన ఆర్టీసీ బస్సులు

దేవాలయాలు, తదితర ప్రముఖ దేవలయాల్లో భక్తులకు దర్శనాలు రద్దు..

వి.వినయ్ చంద్, జిల్లా కల క్టరు, జిల్లా వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ పరిస్థితిని, అవసరమైన అత్యవసర వైద్య సేవలందించడము గురించి అధికారులతోను, వైద్యుల తో ఎప్పటి కపుడు చర్చిస్తూ అవసర మైన సూచ నలు యిస్తూ, ఆదేశాలు జారీ చేస్తున్నారు.

జనతా కర్ఫ్యూ వల్ల సంపూర్ణంగా ఇళ్లకే పరిమితం అయిన ప్రజలు, ప్రజా ప్రతినిధులు, అధికారులు..వ్యాపారులు. సకలం.. స్వచ్చందంగా బంద్.. నిర్మానుష్యంగా వీధులు..
వైద్యులు ఆసుపత్రులలో అత్యవసర సేవలను అందిస్తున్నారు.

కరోనా నిర్మూలన కోసం విశాఖ శారదాపీఠం చేపట్టిన యజ్ఞయాగాదులు కొనసాగుతున్నాయి. కరోనా వైరస్ ప్రభావాన్ని నివారించేందుకు ఈ నెల 18న చేపట్టిన విషజ్వర పీడా హర యాగం ఆదివారం ఐదో రోజుకు చేరింది. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర ఈ యాగాన్ని పర్యవేక్షిస్తున్నారు. యావత్ ప్రపంచం ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పారాయణ కార్యక్రమాన్ని కూడా విశాఖ శారదాపీఠం యాగశాలలో చేపట్టారు. ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడిని ప్రార్థిస్తూ త్రిచ, మహాసౌర సహిత అరుణ పారాయణం నిర్వహిస్తున్నారు. ఆరోగ్య సమస్యలు తలెత్తినపుడు ఈ రకమైన యజ్ఞయాగాదులు చేపట్టాలని వేదశాస్త్రం యోగ వాసిష్టం సూచించింది. కరోనా మహమ్మారి దండెత్తడంతో విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర హైందవ శాస్త్రాలను పరిశీలించి ఈ యాగాలను చేపట్టాలని నిర్ణయించారు

Leave a Reply