Narendra Mod,BJP,Corona Virus

జయహో భారత్:  కరోనా తల వంచాల్సిందే

జయహో భారత్:  కరోనా తల వంచాల్సిందే

హైదరాబాద్:

అత్యవసర పరిస్థితుల్లో దేశం ఇంత ఐక్యత ప్రదర్శిస్తుందా అనే అనుమానం ఉన్నవారికి నివృత్తి చేసే విధంగా జనతా కర్ఫ్యూ జరుగుతున్నది.

ప్రపంచ వ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా వైరస్ ను అడ్డుకోవడానికి దేశంలో విస్తరించకుండా లింక్ చైన్ ను బ్రేక్ చేయడానికి ప్రధాని నరేంద్రమోడీ పిలుపు మేరకు దేశం మొత్తం ఏకతాటిపైకి వచ్చి జనతా కర్ఫ్యూను  పాటిస్తున్నది. కోవిడ్ 19 కేవలం 12 గంటలు మాత్రమే బతికి ఉంటుందని ఈ లోపు దానికి కొత్త ఆసరా దొరక్కపోతే చనిపోతుందని శాస్త్రవేత్తలు తేల్చినందుకు ఈ అవకాశాన్ని వినియోగించుకుని ప్రధాని జనతా కర్ఫ్యూను ప్రతిపాదించారు.

ఈ రోజు 14 గంటల పాటు ఈ సెల్ఫ్ కోరంటైన్ చేసుకుంటే వ్యాధిని దాదాపుగా 80 శాతం అరికట్టవచ్చు.  దేశంలో ప్రస్తుతం 300 మంది ఈ వ్యాధితో ఇప్పుడు ఆసుప్రతుల్లో చేరారు. లక్షలాది మందిని క్వారంటైన్ చేశారు.

నలుగురు వ్యక్తులు ఇప్పటికే మరణించారు. ఈ ఉపద్రవం నుంచి దేశాన్ని కాపాడుకోవడానికి మనల్ని మనం ఇంట్లో బంధించుకోవడం తప్ప వేరే మార్గం లేదు. ఇంత పెద్ద దేశంలో ఇంత జనాభాపై ఆంక్షలు పెట్టి అదుపు చేయడం ఎవరికీ సాధ్యం కాదు. పరీక్షలు చేయడం అంతకన్నా సాధ్యం కాదు.

అలాంటి సమయంలో ప్రధాని నరేంద్ర మోడీకి వచ్చిన ఈ ఆలోచన అంత సులభమైనదేమీ కాదు. 130 కోట్ల మంది భారతీయులు ఇళ్లలో బందీగా ఉండిపోవడం మామూలు పరిస్థితుల్లో అయితే సాధ్యం కాదు. అయితే వ్యాధి తీవ్రత దృష్ట్యా నో, ప్రధాని పై విశ్వాసంతోనో దేశ ప్రజలంతా ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నారు.

అందుకు దేశ ప్రజలను అభినందించక తప్పదు. వందల కోట్లు ఖర్చు చేసినా అదుపు కాని ఈ వ్యాధిని ఈ టెంపరరీ లాక్ డౌన్ తో అరికడితే అంత కన్నా కావాల్సింది ఏమీ లేదు.

దేశాలకు దేశాలు షట్ డౌన్ లోకి వెళ్లిపోతున్నాయి. ఈ పరిస్థితుల్లో శాశ్వత షడ్డౌన్ కన్నా ఇలా తాత్కాలిక షడ్డౌన్ మేలు కదా. అందుకే దేశం ప్రజలంతా సహకరిస్తున్నారు. ఈ ప్రయోగం సక్సెస్ అయితే మరో మూడు నాలుగు సార్లు ఈ విధంగా 14 గంటల బంద్ పాటిస్తే చాలు మన దేశం నుంచి పూర్తిగా కోవిడ్ 19 వైరస్ ను తరిమి కొట్ట వచ్చు.

ఇప్పటి వరకూ విదేశాలకు వెళ్లి వచ్చినవారు, విదేశస్తుల ద్వారానే ఈ వ్యాధి విస్తరిస్తున్నది. ఇప్పుడిప్పుడే మన పౌరులకు (స్థానికంగా ఉండేవారికి) సోకుతున్నది. స్థానికులకు సోకడం మొదలు పెడితే క్వారంటైన్ చేయడం సాధ్యం కాదు. అందుకే ఈ ప్రయత్నం.

గరిష్టంగా ఈ విధంగా నాలుగు సార్లు దేశం మొత్తం జనతా కర్ఫ్యూ విధించుకుంటే వైరస్ మాయం అవుతుంది. దేశ ఆర్ధిక వ్యవస్థ పై భారం లేకుండా మనం దేశాన్ని దేశ ప్రజలను కాపాడుకోగలుగుతాం.

మరీ ముఖ్యంగా మన సైనిక బలగాలలో కొందరికి ఈ వైరస్ సోకింది. అది మరింత ప్రమాదకరం. దాన్ని అరికట్టాల్సిన అవసరం ఉంది. సహకరించండి… మీ భవిష్యత్తు కోసం.

Leave a Reply