జమ్మలమడుగు అసెంబ్లీ స్థానంపై చంద్రబాబు దృష్టి..

జమ్మలమడుగు అసెంబ్లీ స్థానంపై చంద్రబాబు దృష్టి..

ఆది, రామసుబ్బారెడ్డిలలో ఒకరికి కట్టబెట్టే యోచన
అధిష్ఠానం నిర్ణయమే ఫైనల్ అంటున్న నేతలు
నేడు చంద్రబాబుతో భేటీ
జమ్మలమడుగు అసెంబ్లీ స్థానానికి ఎవరిని నిలబెట్టాలనే విషయమై చర్చ జరుగుతోంది. జమ్మలమడుగుతో పాటు కడప పార్లమెంట్ స్థానంపైనా తీవ్ర చర్చ జరుగుతోంది. మంత్రి ఆది నారాయణరెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిల్లో ఒకరికి ఎంపీ స్థానం, మరొకరికి ఎమ్మెల్యే స్థానాన్ని కేటాయించాలనే ఆలోచనలో టీడీపీ అధిష్ఠానం ఉంది.

సీఎం చంద్రబాబు నిర్ణయానికి కట్టుబడి ఉంటామంటూ ఇరువురు నేతలూ చెబుతున్నప్పటికీ తాము కోరిన స్థానాల విషయంలో మాత్రం పట్టుదలతో ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఈ విషయమై సీఎం చంద్రబాబుతో భేటీ అయిన ఇరువురు నేతలు.. నేటి సాయంత్రం మరోసారి భేటీకి సిద్ధమవుతున్నారు. ఈ భేటీతో ఎవరు ఏ స్థానానికి పోటీ చేస్తారనే విషయంలో ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది.