జపాన్ మొబైల్ ఫోన్ తో నగ్న చిత్రాలు నిరోధం

టోక్యో {జపాన్}:

జపాన్ కొత్తగా ఒక మొబైల్ ఫోన్ ను మార్కెట్లోకి తెస్తోంది. ఇకపై మొబైల్ వినియోగదారుడు ఈ మొబైల్ ఫోన్ ఉపయోగించి నగ్నచిత్రాలను తీయడం సాధ్య0 కాదు. ఒకవేళ నగ్న చిత్రాలను తీయాలని మొబైల్ వినియోగదారుడు ప్రయత్నం చేస్తే వెంటనే ఒక హెచ్చరిక స్క్రీన్ పై వస్తుంది. జాప్యానికి చెందిన స్మార్ట్ మొబైల్ టి -బ్రాండ్ టోన్-ఇ 20 మొబైలేను తయారు చేసింది. స్మార్ట్ ఫోన్ ప్రొటెక్షన్ పేరుతో తయారు చేసిన ఈ మొబైల్ లో ఏ-1 ఫీచర్ ప్రవేశ పెట్టింది. ఒక వేళా నగ్న చిత్రాలను తీసేందుకు ప్రయత్నిస్తే ఇన్ అప్రాప్రియేట్ ఇమేజ్ అని హెచ్చరిక వస్తుంది. దాంతో నగ్న చిత్రాన్ని తీయడం సాధ్యం కాదు. చిన్న పిల్లలు వినియోగించే స్మార్ట్ ఫోన్ వల్ల వాళ్ళు నగ్న చిత్రాలు తీసేందుకు ప్రయత్నిస్తే వెంటనే పిల్లల తల్లితండ్రుల ఫోన్లకు సమాచారం వెళుతుంది. నగ్న చిత్రాన్ని తీసే సమయం , తేదీ కూడా ఇందులో నమోదు అవుతాయి.