జగన్ మినహా… అక్రమాస్తుల కేసులో కోర్టుకు విజయసాయి, శ్రీలక్ష్మి, గాలి!

హైదరాబాద్ : తనపై నమోదైన అక్రమాస్తుల కేసులో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి  నేడు సీబీఐ ప్రత్యేక కోర్టు విచారణకు గైర్హాజరయ్యారు.  ఈ  కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయిరెడ్డి తో పాటు ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, మాజీ ఎంపీ గాలి జనార్దన్ రెడ్డిలు కోర్టుకు హాజరయ్యారు.  ఈ కేసులో తనకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ తరఫున ఆయన న్యాయవాది దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు విచారించనుంది .  కాగా నిందితుల హాజరును తీసుకున్న న్యాయస్థానం, తదుపరి కేసు విచారణను వాయిదా వేసింది.