జగన్ పై పోటీకి ప్లాన్ సిద్ధం చేసిన టీడీపీ అధినేత చంద్ర‌బాబు

వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌పై టీడీపీ తన అభ్యర్థిని ఖరారు చేసింది. శాసనమండలి మాజీ ఉపాధ్యక్షుడు, సీనియర్‌ నేత సతీశ్‌రెడ్డిని పులివెందుల అసెంబ్లీ స్థానంలో జగన్‌పై పోటీకి నిలుపనుంది. కొద్దిరోజుల క్రితం కడప జిల్లా ముఖ్యులతో సమావేశమైన సందర్భంగా టీడీపీ అధినేత చంద్రబాబు ఆయన అభ్యర్థిత్వాన్ని తెలియజేశారు. గత ఎన్నికల్లో కూడా ఆయనపై సతీశే పోటీచేశారు. జగన్‌ తండ్రి, దివంగత సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై కూడా సతీశ్‌ పోటీ చేయడం విశేషం. వైఎస్‌ కుటుంబానికి కంచుకోట వంటి పులివెందులలో 20 ఏళ్లుగా ఆయనే టీడీపీ అభ్యర్థిగా తలపడుతున్నారు.వైఎస్ కుటుంబానికి కంచుకోట వంటి క‌డ‌ప‌లో పాగా వేయాల‌ని టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఎప్ప‌టి నుంచో ప్లాన్ సిద్ధం చేసుకుంటున్నారు. ప్ర‌ధానంగా జ‌గ‌న్‌ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌లోనే ఓట‌మి పాలు చేయాల‌ని నిర్ణ‌యించుకున్నారు. క‌డ‌ప‌లో ముఖ్యంగా పులివెందుల‌లో అభివృద్ధి కార్యక్రమాలు, కృష్ణా జలాలు, వైసీపీ నుంచి చేరికల ఆసరాగా సంఖ్య పెంచుకోవాలని టీడీపీ ప్రయత్నిస్తోంది. 2014 ఎన్నికల్లో ఈ జిల్లాలో ఒక్క అసెంబ్లీ సీటు మాత్రమే టీడీపీకి దక్కింది.