జగన్ కోసం తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం!

జగన్ కోసం తెలంగాణ పోలీసుల కొత్త నిర్ణయం!

  • ఇప్పటికే బులెట్ ప్రూఫ్ కారును సమకూర్చిన ప్రభుత్వం
  • ప్రయాణించే మార్గంలో ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చూస్తాం
  • ప్రజలపై ఆంక్షలు లేకుండా ‘రూట్ క్లియరెన్స్’ సౌకర్యం

వైకాపా అధినేత వైఎస్ జగన్ కు భద్రత పెంచి, ఇప్పటికే ఓ బులెట్ ప్రూఫ్ కారును సమకూర్చిన తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడు మరో నిర్ణయం తీసుకుంది. ఆయన హైదరాబాద్ లో ప్రయాణిస్తుంటే, ట్రాఫిక్ అవాంతరాలు లేకుండా చూడాలని ఆదేశాలు ఇచ్చింది. జగన్ కాన్వాయ్ వేగంగా గమ్యాన్ని చేరుకునేందుకు ఈ రూట్ క్లియరెన్స్ సహకరించనుంది. ప్రస్తుతం హైదరాబాద్ లో వీవీఐపీలు పర్యటనలకు వచ్చినప్పుడు, గవర్నర్, కేసీఆర్, చంద్రబాబు, నాయిని తదితర ప్రముఖులకు మాత్రమే ఈ రూట్ క్లియరెన్స్ అమలవుతుండగా, ఈ జాబితాలో జగన్ కూడా చేరారు. అయితే, జగన్ కాన్వాయ్ కోసం ఏ విధమైన కొత్త ఆంక్షలనూ విధించబోమని, ఆయన ప్రయాణించే రూట్ లో ట్రాఫిక్ జామ్ కాకుండా మాత్రమే చూస్తామని పోలీసు అధికారులు వెల్లడించారు. జగన్ కాన్వాయ్ లోని భద్రతను కూడా పెంచాలని పోలీసు అధికారులు నిర్ణయించారు.