జగన్ కోడి కత్తి గురించి సంచలన కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్..!

జగన్ కోడి కత్తి గురించి సంచలన కామెంట్స్ చేసిన పవన్ కళ్యాణ్..!

విశాఖపట్టణం విమానాశ్రయంలో ఇటీవల వైసీపీ అధినేత జగన్ పై కోడి కత్తితో మమ్మిడివరం గ్రామానికి చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి దారుణంగా హత్యాయత్నం చేసిన విషయం అందరికీ తెలిసినదే. జగన్ పై హత్యాయత్నం అన్న వార్త వినగానే 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన రాజకీయ నాయకులతో పాటు చాలా మంది ప్రముఖులు షాక్ తిన్నారు. మరియు అదే విధంగా ప్రధాన పార్టీ రాజకీయ నేతలు జగన్ పై జరిగిన దాడిని ఖండించారు. ఈ క్రమంలో తాజాగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ జగన్ పై కోడి కత్తి తో చేసిన దాడి గురించి సంచలన కామెంట్ చేశారు. ముఖ్యంగా జగన్ పై దాడి విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అనుసరిస్తున్న విధానం సిగ్గుచేటు అంటూ మరియు అదే విధంగా ఆ మర్డర్ జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు చేశారని టీడీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని పేర్కొన్నారు.

తాజాగా ఇటీవల జరిగిన బహిరంగసభలో పవన్ కళ్యాణ్ ఎవ్వరు ఊహించని స్థాయిలో సంచలన కామెంట్స్ చేసారు,కోడి పందాలకు ఉపయోగించే చిన్న చుర కత్తితో ఎవరో దాడి చేశారని జగన్ ఒక పక్క బాధ పడుతుంటే,తెలుగుదేశం నేతలేమో చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు.ఎవరో కుర్రాడు జగన్ మీద దాడి చేస్తే దాన్ని జనసేన పార్టీ మీదకి నెట్టే స్థితికి తెలుగుదేశం పార్టీ నేతలు దిగజారిపోయారని మండిపడ్డారు. రాష్ట్రంలో తెలుగుదేశం నాయకులు ఎలా తయారయ్యారంటే ఎక్కడో ఎవరో ఎవరితోనో పడుకుంటే దానికి కారణం కూడా పవన్ కల్యాణే చేపించాడు..అన్ని రాజకీయ లబ్ది పొందాలని జనసేన పార్టీ పై బురద చల్లాలని టీడీపీ చండాలమైన ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శలు చేశారు.