జగన్ అక్రమాస్తుల కేసు నుంచి ఆదిత్యనాథ్ దాస్ కు మినహాయింపుపై ‘సుప్రీం’ నోటీసులు

జగన్ అక్రమాస్తుల కేసు నుంచి ఆదిత్యనాథ్ దాస్ కు మినహాయింపుపై ‘సుప్రీం’ నోటీసులు

  • నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆదిత్యనాథ్ దాస్ పై కేసు
  • ఈ కేసు నుంచి మినహాయింపు ఇచ్చిన హైకోర్టు
  • ఈ తీర్పును సవాల్ చేసిన సీబీఐ

ఏపీ నీటిపారుదల శాఖ కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ కు సుప్రీం కోర్టు నోటీసులు పంపింది. వైసీపీ అధినేత జగన్ అక్రమాస్తుల కేసు నుంచి ఆయనకు హైకోర్టు మినహాయింపు ఇవ్వడంపై సీబీఐ సవాల్ చేసింది. సీబీఐ దాఖలు చేసిన ఈ పిటిషన్ పై అత్యున్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని, విచారణ కూడా ఎదుర్కోవాలని సుప్రీంకోర్టు నోటీసుల్లో ఆదిత్యనాథ్ ను ఆదేశించింది. కాగా, నాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రోశయ్య, కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వాలు జగన్ అక్రమాస్తుల కేసుకు సంబంధించి ఐఏఎస్ అధికారులు ఎల్వీ సుబ్రహ్మణ్యం, మన్మోహన్ సింగ్, ఆదిత్యనాథ్ సింగ్ సహా పలువురు అధికారులపై కేసులు దాఖలు చేశాయి.