చట్టం – ధర్మం

ఆటవిక సంస్కృతి నుండి నాగరక సమాజం వైపు రావడానికి మనకు ఎంత కాలం పట్టిందో ? ఎంతగా నాగరకత పెరిగినా రాముడున్న రోజుల్లోనే రావణులూ ఉన్నారు . నేరము – శిక్ష అనాదిగా ఉన్నవే . నేరాలను విచారించడానికి , తగిన శిక్షలు వేయడానికి చట్టాలు కూడా ఎప్పటినుండో ఉన్నాయి .
అయితే మన నైతిక ప్రవర్తన , ధర్మ మార్గమే స్థూలంగా సమాజాన్ని , దేశాన్ని భద్రంగా నడుపుతుంది . ఈ విషయంలో చట్టం కంటే ధర్మమే గొప్పదవుతుంది . 125 కోట్ల మందికి 125 కోట్ల మంది పోలీసులను పెట్టలేరు , పెట్టాల్సిన పని కూడా లేదు .
విష్ణు సహస్రంలో ఆచారం నుండి ధర్మం పుడుతుందని ఒక మాట . చెబితే ధర్మం కాదు . ఆచరిస్తేనే ధర్మం . ధర్మస్య ప్రభురచ్యుతః . ధర్మాన్ని ఆచరింపజేసేవాడు , దాన్ని ఆచరించడం వల్ల ఫలితాన్ని ఇచ్చేవాడు , ఆచరించకపోతే దండించేవాడు – ఆ దేవదేవుడే .

పిండితార్థం – మనకు మనంగా ధర్మమార్గంలో నిలబడితే , నడిస్తే – చట్టాల పరిధి చాలా పరిమితం .

శుభోదయం