చంద్రబాబుపై రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డి తీవ్ర విమర్శలు

అమరావతి: . డ్యాం పునాదుటీడీపీ అధినేత చంద్రబాబుపై రాజ్యసభ ఎంపీ విజయ సాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు.  చంద్రబాబు పోలవరంలో  పెద్దమొత్తంలో దోచుకున్న  సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలనుకున్నారని ఆరోపించారు. ప్రజలు  అయన కుట్రలను తిప్పికొట్టారని  నడుములిరిగేలా నేలపై పడ్డాడరని.ల నుంచి అవినీతి సాక్ష్యాలు ఉబికి వస్తున్నాయన్నారు. ఎవరి కాళ్లు పట్టుకుని బయట పడాలా అని చంద్రబాబు వెతుకుతున్నారని విజయసాయిరెడ్డి అన్నారు. సీఎం జగన్ తీసుకుంటున్న సాహసోపేత నిర్ణయాలు, చేపడుతున్న పథకాలను 15 రాష్ట్రాలు అధ్యయనం చేస్తున్నాయంటూ ట్వీట్‌లో విజయసాయి తెలిపారు. రివర్స్ టెండరింగ్, జ్యుడిషియల్ కమిషన్, అమ్మ ఒడి, గ్రామ వలంటీర్ వ్యవస్థ, ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం వంటి అంశాలను పరిశీలిస్తున్నారని ఆయన అన్నారు. మొదటిసారి సీఎం అయిన 46 ఏళ్ల యువకుడు దేశానికి మార్గదర్శిగా నిలుస్తున్నారంటూ ముఖ్యమంత్రిపై ప్రశంసల వర్షం కురిపించారు.