చంద్రబాబుకు చెబుదామంటే లేరు… బాలకృష్ణకు మాత్రం చెప్పాను: అంబికా కృష్ణ

తాను పార్టీని మారాలని నిర్ణయించుకున్న తరువాత, ఆ విషయాన్ని చంద్రబాబునాయుడికి చెప్పలేదని సినీ నిర్మాత అంబికా కృష్ణ వెల్లడించారు. బీజేపీలో చేరిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, ఈ విషయాన్ని చంద్రబాబుకు చెబుదామనే అనుకున్నానని, అయితే, ఆయన అందుబాటులో లేరని అన్నారు. అందుకే హీరో బాలకృష్ణకు విషయం చెప్పానని తెలిపారు. తానేమీ తెలుగుదేశం పార్టీకి ద్రోహం చేయలేదని స్పష్టం చేశారు. బీజేపీతో తెలుగుదేశం పార్టీకి ఉన్న విభేదాలు, కాంగ్రెస్‌ తో కలవడం, సుమారు 60 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు టికెట్లవ్వడం తదితర కారణాలతోనే టీడీపీ ఓడిపోయిందని అంబికా కృష్ణ అభిప్రాయపడ్డారు.
Tags: ambikaa krishna, bjp party, chandra babu naidu

Leave a Reply