గులాబీమయమైన హైదరాబాద్.. ప్రగతి నివేదన సభకు పోటెత్తుతున్న జనం!

  • సభకు సిద్ధమైన కొంగర్ కలాన్
  • రేపు భేటీ కానున్న తెలంగాణ కేబినెట్
  • ప్రభుత్వ రద్దుకు సిఫార్సు చేయొచ్చని ఊహాగానాలు

నాలుగున్నరేళ్ల కాలంలో తాము అందించిన పాలన, చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) నిర్వహించనున్న ప్రగతి నివేదన సభకు సర్వం సిద్ధమైంది. రేపు రంగారెడ్డి జిల్లా కొంగర్ కలాన్ లో నిర్వహించనున్న ఈ వేడుక కోసం 31 జిల్లాల నుంచి ప్రజలు భారీగా తరలివస్తున్నారు. పార్టీ జెండాలు, గులాబీ రంగులతో అలంకరించిన ట్రాక్టర్లు, లారీల్లో ప్రజలు హైదరాబాద్ కు చేరుకుంటున్నారు.