కేసీఆర్‌కు కాణిపాకం లడ్డూ

ఐరాల(కాణిపాకం): కాణిపాక వినాయకస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల లడ్డూ ప్రసాద వేలం ఆదివారం నిర్వహించిన విషయం విదితమే. తెలంగాణ రాష్ట్రం సిద్ధిపేటకు చెందిన చెందిన ముర్రంశెట్టి రాములు అత్యధికంగా రూ.1.41 లక్షలకు పాట పాడి దక్కించుకున్నారు. టీటీడీ బోర్డుమెంబర్‌గా తనకు అవకాశం కల్పించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వరసిద్ధుడి లడ్డూ ప్రసాదాన్ని అంకితం ఇస్తున్నట్లు ముర్రంశెట్టి పేర్కొన్నారు.