కేటీఆర్ కు ఆహ్వానం పంపిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్

యూఏఈలో పర్యటించాలంటూ కేటీఆర్ కు లేఖ
తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యానికి ధన్యవాదాలు తెలిపిన మంత్రి అబ్దుల్లా
తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన అంశాలకు సహకారం అందిస్తామంటూ హామీ
తెలంగాణ మంత్రి కేటీఆర్ కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. తమ దేశంలో పర్యటించాలంటూ కేటీఆర్ ను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆహ్వానించింది. ఈ మేరకు యూఏఈ విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ లేఖ రాశారు. తెలంగాణ పర్యటన సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆతిథ్యాన్ని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించి, ధన్యవాదాలు తెలిపారు. తమ దృష్టికి తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు అంశాలకు సంబంధించి తమ ప్రభుత్వం పూర్తి స్థాయిలో సహాయ సహకారాలను అందిస్తుందని పేర్కొన్నారు. తమ దేశంలో పర్యటించాల్సిందిగా కేటీఆర్ ను ఆహ్వానించారు.