కేంద్రంపై ఇద్దరు ముఖ్యమంత్రుల అసంతృప్తి అంటూ ఈనాడు దినపత్రిక కథనం కల్పితం: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం

24–09–2019
అమరావతి

*ఏపీ, తెలంగాణ ముఖ్యమంత్రుల సమావేశంలో అలాంటి అంశం ఏదీ ప్రస్తావనకు రాలేదు: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం*

*ఊహాజనిత అంశాలు రాసి ప్రజలను తప్పుదోవ పట్టించవద్దు : ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం*

*ఈనాడు దినపత్రిక కథనాన్ని ఖండిస్తున్నాం, ఉద్దేశపూర్వకంగా రాసిన కథనంగా భావిస్తున్నాం : ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం*

*ఇరురాష్ట్రాల ప్రజల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ సమావేశం సాగింది: ఏపీ ముఖ్య మంత్రి కార్యాలయం*

*గత నాలుగు నెలలుగా ఉభయ రాష్ట్రాల ప్రయోజనాల లక్ష్యంగా ఇరువురు ముఖ్యమంత్రుల మధ్య సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం*

*రాజకీయ అంశాలు, రాజకీయ సమీకరణాలకు దూరంగా ఈ సమావేశాలు జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం*

*గోదావరి జలాలను తరలింపుద్వారా సాగర్‌ కుడికాల్వ కింద ఉన్న కృష్ణాడెల్టా, ప్రకాశం సహా రాయలసీమకూ, తెలంగాణలోని పాత మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు మేలు చేకూర్చే అంశంపై సుదీర్ఘ చర్చలు జరిగాయి: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం*

*ఈ ప్రాజెక్టును సఫలం చేసే దిశగా నిశితంగా ఇద్దరు ముఖ్యమంత్రులు చర్చించారు: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం*

*అపరిష్కృతంగా ఉన్న విభజన అంశాలను కూడా రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించారు: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం*

*పోలీసు అధికారులకు సంబంధించిన విభజన అంశాలను చర్చించారు: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం*

*తెలంగాణలో కొత్తగా నియామకం అవుతున్న పోలీస్‌కానిస్టేబుళ్లకు ఏపీలోకూడా శిక్షణ ఇచ్చే అంశంపైనా చర్చ జరిగింది: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం*

*విద్యుత్‌ ఉద్యోగుల సమస్యలపైనా ఇద్దరు ముఖ్యమంత్రులు దృష్టిపెట్టారు: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం*

*నిన్నటి సమావేశంలో రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశాలు తప్ప మరే ఇతర విషయాలూ చోటు చేసుకోలేదు: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం*

*ఇలాంటి సమావేశంమీద ఊహాజనిత అంశాలు రాసి ప్రజలను తప్పుదోవపట్టించడం దురదృష్టకరం: ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం*

*ఇలాంటి కథనాలను తీవ్రంగా ఖండిస్తున్నాం : ఏపీ ముఖ్యమంత్రి కార్యాలయం*