కర్ణాటక బై పోల్స్... అన్ని చోట్లా కాంగ్రెస్ లీడింగ్... కనిపించని బీజేపీ ప్రభావం!

కర్ణాటక బై పోల్స్… అన్ని చోట్లా కాంగ్రెస్ లీడింగ్… కనిపించని బీజేపీ ప్రభావం!

కర్ణాటకలో జరిగిన ఉప ఎన్నికల తరువాత ఈ ఉదయం కౌంటింగ్ ప్రారంభమైంది. తాజా ట్రెండ్స్ ప్రకారం, బీజేపీ ఏ స్థానంలోనూ ప్రభావం చూపడం లేదు. జమ్ఖాండీ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో మూడు రౌండ్ల ఓట్ల లెక్కింపు ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి కులకర్ణి శ్రీకాంత్ సుబ్రావ్ పై కాంగ్రెస్ అభ్యర్థి ఆనంద్ సిద్ధూ న్యామ్ గౌడ 55,433 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. రామ్ నగర్ అసెంబ్లీకి జరుగుతున్న కౌంటింగ్ లో 2వ రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి ఎల్ చంద్రశేఖర్ కన్నా, జేడీఎస్ అభ్యర్థి అనితా కుమారస్వామి 8,430 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. బళ్లారి పార్లమెంట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి వీఎస్ ఉగ్రప్ప తొలి రౌండ్ లోనే భారీ ఆధిక్యాన్ని చూపిస్తున్నారు. బీజేపీకి చెందిన జే శాంతాపై 17,480 ఓట్ల ఆధిక్యంలో ఆయన ఉన్నారు.