కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా:జగన్ అభ్యంతరం

facebooktwitterGooglewhatsappGoogle
కరోనాపై అధికారులతో  జగన్ సమీక్ష నిర్వహించారు. కరోనా సాకుతో స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం వాయిదా వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆదివారం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకవైపు కరోనా సాకుతో ఎన్నికలు వాయిదా వేశామని చెబతూనే.. మరోవైపు అధికారులను తప్పిస్తున్నారని మండిపడ్డారు. నిష్పాక్షికంగా ఉండాల్సిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌ విచక్షణ కోల్పోయారని అన్నారు.‘కరోనా వైరస్‌పై కొన్ని విషయాలు అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. చైనాలో 80 వేల మందికి కరోనా వైరస్‌ సోకిందని గుర్తుచేశారు. కరోనా వల్ల మనుషులు చనిపోతారని.. ఇదొక భయానక పరిస్థితి అని పానిక్‌ బటన్‌ నొక్కాల్సిన అవసరం లేదన్నారు. 60 ఏళ్ల వయసు ఉన్నవారికి, మధుమేహం, ఇతర వ్యాధులు ఉన్నవారికి కరోనా వల్ల కొంత ప్రభావం కలిగే అవకాశం ఉందన్నారు జగన్. 81.9 శాతం కేసులు ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్నారు. 13 శాతం కేసులు ఆస్పత్రుల్లో చికిత్స చేయించుకున్నారు. 4.7 శాతం కేసులు మాత్రమే ఐసీయూలో చికిత్స జరిగింది. ఎవరికీ ఇబ్బందులు రాకూడదనే తమ తాపత్రాయం అన్నారు. ఏపీ నుంచి 70 మంది శాంపిల్స్‌ పంపితే.. ఒక్కరికే పాజిటివ్‌గా తేలిందన్నారు. గ్రామ వాలంటీర్లు ప్రతి ఇంటికి తిరిగి కరోనాపై అవగాహన కల్పిస్తున్నారన్నారు. ప్రపంచవ్యాప్తంగా 145 దేశాలను హడలెత్తిస్తున్న కరోనా రాష్ట్రానికి సైతం పాకింది. శనివారం ఉదయానికి 14 అనుమానిత కేసులు ఉండగా రాత్రి 8 గంటలకు కొత్తగా మరో 7 కేసులు నమోదయ్యాయి. అనుమానిత లక్షణాలతో విశాఖలో ఐదుగురు, తూర్పుగోదావరి జిల్లాలో 9 మంది, నెల్లూరులో ఐదుగురు, కడప, అనంతపురం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.నెల్లూరులోని ఐదుగురిలో ఒకరికి వైరస్‌ సోకిందని నిర్ధరణ అయింది. మొత్తం 70 మంది నమూనాలను పరీక్షలకు పంపంగా వారిలో 57 మందికి నెగటివ్‌ అని వచ్చిందన్నారు. మిగతా 12 మంది నివేదికల కోసం అధికారులు ఎదురుచూస్తున్నారు. విజయవాడ సిద్దార్ధ కళాశాలలో నమూనాల పరీక్షలు ప్రారంభమవ్వగా ఇక్కడ పరీక్షించిన ఐదుగురి నమూనాలను పుణెకు పంపారు. అక్కడ వారు సంతృప్తి వ్యక్తంచేసిన తర్వత ఫలితాలను ప్రకటించనున్నారు.ఫిబ్రవరి 10 తర్వాత విదేశాల నుంచి రాష్ట్రానికి 3 వేలమందికి పైగా వచ్చినట్లు సమాచారం. వీరిలో కేవలం 675 మంది సమచారం మాత్రమే వైద్య అధికారుల వద్ద ఉంది. వీరిలో 428 గృహాల్లో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నారు. ప్రత్యేకంగా గుంటూరు జిల్లాకు 426 మంది వచ్చారని గుర్తించిన వైద్య ఆరోగ్యశాఖ ఎక్కువ మంది గుంటూరు, తెనాలి డివిజన్లకు చెందిన వారున్నట్లు పేర్కొన్నారు. వైద్య సిబ్బంది వారి వద్దకు వెళ్లి ఆరా తీయగా వారిలో ఎవరికి అనుమానిత లక్షణాలు లేవని తేలాయి. అయితే 14 రోజుల పాటు ఏకాంతగా ఉండాలని, ఎవరినీ కలవొద్దని వారికి సూచించారు. నిత్యం వారి ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేయనున్నారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ప్రతి ప్రైవేటు ఆస్పత్రుల్లోని 5 ప్రత్యేక గదులు, పది పడకల వంతున అందుబాటులో ఉంచాలని వైద్య, ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి ఉత్తర్వులు జారీచేశారు.రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితిపై ముఖ్యమంత్రి జగన్‌ సమీక్ష జరిపారు. తెలంగాణ, ఇతర రాష్ట్రాల్లోని పరిస్థితులు, వైరస్‌ నిరోధానికి రాష్ట్రంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై భేటీలో చర్చించనున్నారు.