కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిని హౌస్ అరెస్ట్ చేసిన పోలీసులు

కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం చేశారు. రాయచోటిలో ఆయనను అదుపులోకి తీసుకున్న పోలీసులు… ఆయన స్వగ్రామం అక్కిరెడ్డిపల్లికి తీసుకొచ్చి, హౌస్ అరెస్ట్ చేశారు. పోలీసుల తీరుపై శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటర్నింగ్ ఆఫీసర్ అనుమతి ఉన్నప్పటికీ తనను అరెస్ట్ చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు. గన్ మెన్లతో కలసి పోలింగ్ కేంద్రాల వద్ద తిరుగున్న నేపథ్యంలో, పైఅధికారుల నుంచి తమకు ఆదేశాలు వచ్చాయని… అందుకే అదుపులోకి తీసుకున్నామని పోలీసులు ఆయనకు సమాధానమిచ్చారు.