trump vs obama

ఒబామాకు నోబెల్ ప్రైజ్ ఎందుకిచ్చారో నాకు అర్థం కావడం లేదు: ట్రంప్

  • నాకు నోబెల్ శాంతి పురస్కారం ఎప్పుడో రావాలి
  • నిర్వాహకులు పారదర్శకంగా వ్యవహరించడం లేదు
  • నేను ఎన్నో మంచి పనులు చేశాను

తనకు ఇంత వరకు నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇవ్వకపోవడంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు నోబెల్ పీస్ ప్రైజ్ ఇవ్వకపోవడం సరికాదని అన్నారు. తాను ఎంతో చేశానని… తాను చేసిన మంచి పనులకు తనకు ఇప్పటికే నోబెల్ ప్రైజ్ రావాల్సి ఉందని చెప్పారు.

పారదర్శకంగా నోబెల్ శాంతి పురస్కారాన్ని ఇచ్చినట్టైతే తనకు ఎప్పుడో అది వచ్చి ఉండేదని… కానీ, వారు పారదర్శకంగా లేరని విమర్శించారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాకు నోబెల్ పీస్ ప్రైజ్ ఎందుకిచ్చారో తనకు అర్థం కావడం లేదని అన్నారు.