ఏపీ సీఎంకు టీడీపీ నేత గంటా శ్రీనివాసరావు! బహిరంగ లేఖ

విశాఖపట్నం భూ కుంభకోణం కేసులో మళ్లీ దర్యాప్తు జరిపించాలని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు బహిరంగ లేఖ లేశారు. భూ కుంభకోణంల కేసులో దర్యాప్తు సమగ్రంగా జరిపించాలని పలువురు వైసీపీ నేతలు కోరుతున్నారనీ, వారి డిమాండ్ ను తాను స్వాగతిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. . ఈ కేసులో సిట్ ద్వారా విచారణను పున: ప్రారంభించాలనిఅయన కోరారు. విశాఖ భూ కుంభకోణం వెనుక ఎవరు ఉన్నారో ప్రజలకు తెలపాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈ కేసులో ఎంత పెద్దవారున్నా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి జగన్ 100 రోజుల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు గంటా శుభాకాంక్షలు తెలిపారు.