ఏపీ రాజధానిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం.. 16న శంకుస్థాపన

తాడేపల్లి సమీపంలో బీజేపీ కార్యాలయం
ఎకరం స్థలంలో నిర్మాణం
16న శంకుస్థాపన చేయనున్న కేంద్రమంత్రి పీయూష్ గోయల్
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటు కాబోతోంది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ తెలిపారు. తాడేపల్లి సిమెంట్ ఫ్యాక్టరీ సమీపంలో కార్యాలయ నిర్మాణానికి ఎంపిక చేసిన ఎకరం స్థలాన్ని ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ నెల 16న కేంద్రమంత్రి పీయూష్ గోయల్ కార్యాలయ నిర్మాణానికి భూమి పూజ చేయనున్నట్టు కన్నా తెలిపారు. సార్వత్రిక ఎన్నికలకు ముందే నిర్మాణాన్ని పూర్తి చేస్తామని పేర్కొన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ 6న కార్యాలయాన్ని ప్రారంభించనున్నట్టు కన్నా తెలిపారు. కాగా, ఇప్పటికే జనసేన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలు పార్టీ కార్యాలయ నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నాయి. ఇప్పుడు బీజేపీ కూడా చేరడంతో ప్రధాన పార్టీల కార్యాలయాలన్నీ అమరావతికి వచ్చినట్టే.