ఏపీ మంత్రి నారాయణ ఎజిఎం ఇంట్లో భారీగా డబ్బు పట్టివేత

  • ఏపీలో భారీగా పట్టుబడుతున్న డబ్బు
    • ఏపీ ఎన్నికల్లో మొదలైన ప్రలోభాలు

    • సోదాలు ముమ్మరం చేసిన పోలీసులు
నెల్లూరు బాలాజీ నగర్‌లో నారాయణ కాలేజీ ఏజీఎం ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. ఈ సోదాల్లో రూ.9 లక్షల డబ్బు.. ఓటరు జాబితాలు, ఓటరు స్లిప్పులు దొరికాయి.. తాజాగా నెల్లూరులో మంత్రి నారాయణ కాలేజీ ఏజీఎం ఇంట్లో భారీగా డబ్బు దొరికింది. ఆ డబ్బుకు సంబంధించి ఎలాంటి పత్రాలు సమర్పించకపోవడంతో పోలీసులు సీజ్ చేశారు. పద్మనాభరెడ్డిపై కేసు నమోదు చేశారు. ఏపీ ఎన్నికల్లో ప్రచారానికి మరో ఐదు రోజుల్లో తెరపడనుంది. పోలింగ్‌కు మరో వారం మాత్రమే సమయం ఉంది. సమయం ముంచుకొస్తుండటంతో ప్రలోభాల పర్వాలు మొదలయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తనిఖీల్లో.. నోట్ల కట్టలు బయటపడుతూనే ఉన్నాయి.  ఏజీఎంతో పాటూ నారాయణ కాలేజీ సిబ్బంది ఇళ్లలో సోదాలు చేస్తున్నారు.