ఏపీ కొత్త అడ్వకేట్ జనరల్‌గా శ్రీరాం.. ఏఏజీగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి!

ఏపీ కొత్త అడ్వకేట్ జనరల్‌గా శ్రీరాం.. ఏఏజీగా పొన్నవోలు సుధాకర్ రెడ్డి!

ఆంధ్రప్రదేశ్ నూతన అడ్వకేట్ జనరల్ (ఏజీ)గా ఎస్.శ్రీరాంను నియమించనున్నట్టు తెలుస్తోంది. గత మూడేళ్లుగా ఏపీ అడ్వకేట్ జనరల్ (ఏజీ)గా సేవలు అందించిన దమ్మాలపాటి శ్రీనివాస్ పదవి నుంచి వైదొలిగారు. ఏపీ అసెంబ్లీ ఫలితాలు వెలువడిన అనంతరం ఆయన తన పదవికి రాజీనామా చేశారు. దీంతో ఆయన స్థానంలో శ్రీరాంను నియమించాలని కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నిర్ణయించినట్టు తెలుస్తోంది.

అలాగే, అదనపు అడ్వకేట్ జనరల్‌గా పొన్నవోలు సుధాకర్‌రెడ్డిని నియమించనున్నట్టు సమాచారం. జగన్ రేపు ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం వీరి నియామకానికి సంబంధించి ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉంది. ఏజీ, ఏఏజీ నియామకాల తర్వాత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదులు(ఎస్‌జీపీ), ప్రభుత్వ న్యాయవాదులు(జీపీ), సహాయ ప్రభుత్వ న్యాయవాదులు(ఏజీపీ), కార్పొరేషన్లకు స్టాండింగ్‌ కౌన్సిళ్లను నియమించనున్నారు.