తెలుగుదేశం పార్టీకి సాంకేతిక సేవలు అందిస్తున్న ‘డేటా గ్రిడ్’ కంపెనీ వ్యవహారం కాకరేపుతున్న సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు ఏపీ

ఏపీలో రేపు, ఎల్లుండి భారీగా పెరగనున్న ఉష్ణోగ్రతలు..

ఆంధ్రప్రదేశ్ లో రేపు, ఎల్లుండి పగటి ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వాతావరణ శాఖ తెలిపింది. బుధ, గురువారాల్లో ఎండ తీవ్రత పెరగడంతో పాటు బలమైన వడగాలులు వీస్తాయని వెల్లడించింది. ఈ విషయమై వాతావరణ శాఖ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఈరోజు ఏపీలో పగటి ఉష్ణోగ్రత సాధారణం కంటే 2-3 డిగ్రీల సెల్సియస్ పెరుగుతుందని చెప్పారు.

రేపు ముఖ్యంగా రాయలసీమలో వడగాలులు వీస్తాయని ఆయన హెచ్చరించారు. ఎల్లుండి అంటే గురువారం ప్రకాశం, నెల్లూరుతో పాటు రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో ఉష్ణోగ్రతతో పాటు వడగాల్పుల తీవ్రత కూడా పెరుగుతుందని తెలిపారు.

మరోవైపు రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలో అక్కడక్కడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొన్నారు. పగటిపూట బయటకు వెళ్లే ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ, వడదెబ్బకు గురికాకుండా విరివిగా పానీయాలను సేవించాలని సూచించారు.