ఏపీలో నేటితో ప్రైవేటు మద్యం అమ్మకాలు బంద్!

  • రేపటి నుంచి మద్యం దుకాణాలను నిర్వహించనున్న ప్రభుత్వం
  • కొత్త షాపుల ఏర్పాటు పనుల్లో అధికారుల బిజీ
  • 3,448 దుకాణాలను ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ వైన్ షాపుల ద్వారా మద్యం అమ్మకాలకు నేటితో తెరపడనుంది. రేపటి నుంచి ప్రభుత్వమే మద్యం దుకాణాలను నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో, షాపులను ఖాళీ చేసే పనుల్లో మద్యం వ్యాపారులు ఉన్నారు. మరోవైపు, ఎక్సైజ్ శాఖ అద్దెకు తీసుకున్న దుకాణాల్లో సరకును నింపడం, సిబ్బందిని సమకూర్చడం, కొత్తగా అమ్మకాలను ప్రారంభించడం వంటి పనుల్లో అధికారులు ఉన్నారు. విడతలవారీగా మద్యపాన నిషేధాన్ని ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తొలి విడతలో ప్రస్తుతం ఉన్న 4,380 షాపుల్లో 20 శాతం తగ్గించి, 3,448 దుకాణాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.