వైసీపీని 25 స్థానాల్లో గెలిపిస్తే ప్రత్యేక హోదాను ఆపడం ఎవరి తరం కాదు: జగన్

ఏపీలో అధికారంలోకి వస్తాం.. జాతీయ మీడియాతో జగన్!

  • ఈ విషయమై పూర్తి ధీమాగా ఉన్నాం
  • ఏపీ ప్రజలు ప్రస్తుతం మార్పును కోరుకుంటున్నారు
  • ధైర్యంగా వచ్చి ఓటును వేయాలని పిలుపు

ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత జగన్ ఈరోజు ఓటు హక్కును వినియోగించుకున్న సంగతి తెలిసిందే. భార్య భారతి, సోదరి షర్మిల, తల్లి విజయమ్మతో కలిసి జగన్ ఈరోజు పులివెందుల నియోజకవర్గంలో జగన్ ఓటేశారు. ఈ సందర్భంగా జాతీయ మీడియా ప్రతినిధులతో జగన్ మాట్లాడారు. ఏపీలో విజయం సాధించడంపై తాను ధీమాగా ఉన్నానని జగన్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రస్తుతం మార్పును కోరుకుంటున్నారని వ్యాఖ్యానించారు. దేవుడి ఆశీర్వాదంతో అన్ని సవ్యంగానే సాగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘తొలిసారి ఓటు హక్కును పొందిన యువతకు ఏం చెబుతారు?’ అని మీడియా ప్రశ్నించగా.. ‘మార్పు కోసం ఓటేయండి.. ధైర్యంగా ఓటేయండి’ అని జగన్ పిలుపు ఇచ్చారు.

అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. పులివెందుల నుంచి జగన్ పోటీలో ఉండగా, టీడీపీ తరఫున ఆయనపై సింగారెడ్డి వెంకట సతీశ్ రెడ్డి పోటీ చేస్తున్నారు.

Embedded video

NDTV

@ndtv

Simultaneous assembly and parliamentary elections are being held in Andhra Pradesh today