ఎన్నిక‌ల్లో రిగ్గింగ్ జ‌రిగింది.. సైబర్ నిపుణుడు సయ్యద్

ఎన్నిక‌ల్లో రిగ్గింగ్ జ‌రిగింది.. సైబర్ నిపుణుడు సయ్యద్

ఈసీఐఎల్ రూపొందించిన ఈవీఎంల రూపకల్పన బృందంలో సభ్యుడైన అమెరికాలోని సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్ప‌టికే ఈవీఎంల‌పై ర‌క‌ర‌కాల ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతుండ‌గా…దానిపై క‌ల‌క‌లం రేపే కామెంట్లు చేశారు. గత లోక్ సభ సాధారణ ఎన్నికల్లో ఈవీఎంలను బీజేపీ హ్యాకింగ్ ద్వారా రిగ్గింగ్ చేసిందని బాంబు పేల్చిన , ఈ కుట్రకి కేంద్రం హైదరాబాద్ అని చెప్పి మరో బాంబు పేల్చాడు. షుజా మిలటరీ గ్రేడ్ ఫ్రీక్వెన్సీ విడుదల చేసే మాడ్యులేటర్‌తో బీజేపీ ఈవీఎంలను హ్యాక్ చేస్తున్నట్టు గుర్తించానని తెలిపాడు.

2009-2014 సమయంలో తాను ఈసీఐఎల్ లో పనిచేసినట్టు సయ్యద్ షుజా తెలిపారు. 2014 ఎన్నికల్లో వాడిన ఈవీఎంలను రూపొందించిన బృందంలో తాను సభ్యుడిగా పనిచేసినట్టు షుజా తెలిపారు. గత లోక్‌సభ సాధారణ ఎన్నికల్లో రిగ్గింగ్ చేశారని ఈవీఎంలను రూపొందించిన సైబర్ నిపుణుడు సయ్యద్ షుజా ఆరోపించారు. సాధారణ ఎన్నికల సందర్భంగా ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, ఢిల్లీ ఫలితాలను రిగ్గింగ్ చేయడం జరిగిందని షుజా స్పష్టం చేశారు. బీజేపీ ఈవీఎంలను హ్యాకింగ్ చేసిందని తెలిపారు. మిలటరీ గ్రేడ్ ఫ్రీక్వెన్సీని విడుదల చేసే మాడ్యులేటర్ తో బీజేపీ ఈవీఎంలను హ్యాకింగ్ చేసిందన్నారు. లోక్ సభ ఎన్నికలలో వాడిన ఈవీఎంల నుంచి సిగ్నల్స్ వస్తున్నట్టు ఏప్రిల్ 2014 తాను గుర్తించినట్టు సయ్యద్ షుజా చెప్పారు. ఈ రహస్యాన్ని గుర్తించిన తమ బృందం బీజేపీని బ్లాక్ మెయిల్ చేయడానికి ప్రయత్నించింది.

బీజేపీ నేతలతో సమావేశమయ్యేందుకు ప్రయత్నించామని తెలిపాడు. హైదరాబాద్ శివార్లలో ఒక బీజేపీ నేత ఇంటికి తాము వెళ్లినట్టు వివరించాడు. అక్కడ తమపై కాల్పులు జరపగా తను గాయాలతో బయటపడి బతికినట్టు చెప్పాడు. ఈ కాల్పుల ఘటనను కప్పిపుచ్చేందుకు హైదరాబాద్ లోని కిషన్ గఢ్ లో మత కల్లోలాన్ని, హింసాకాండను సృష్టించారని అన్నాడు. తన బృందంలోని ఇతర సహచరులను ఆ హింసలో చనిపోయినట్టు చూపించారని ఆరోపించాడు. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న షుజా లండన్ నుంచి ఈవీఎంలను హ్యాకింగ్ చేయడాన్ని ప్రదర్శించారు. ఇటీవల జరిగిన ఈవీఎంలను వినియోగించిన ఎన్నికల్లో ఎక్కడ మెషీన్లను ట్యాంపర్ చేశారో తాను గుర్తించగలనని అన్నారు.