ఉదయం వైసీపీలో చేరి.. సాయంత్రానికల్లా మళ్లీ టీడీపీలోకి వచ్చేశారు

ఉదయం వైసీపీలో చేరి.. సాయంత్రానికల్లా మళ్లీ టీడీపీలోకి వచ్చేశారు

గుంటూరు జిల్లా అమరావతి మండలం మునుగోడు గ్రామంలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. ఉదయం వైసీపీలో చేరిన కొందరు టీడీపీ కార్యకర్తలు… సాయంత్రానికల్లా తిరిగి సొంత పార్టీలోకి వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, వ్యక్తిగత కారణాలు, ఆర్థిక ఇబ్బందులు ఉన్న తమను ఆదుకుంటామని వైసీపీ నేతలు తమకు హామీ ఇవ్వడంతో ఆ పార్టీలో చేరామని… తీరా వారు చెప్పిన మాటలు అబద్ధమని తెలిసి మళ్లీ సొంత పార్టీలోకి వచ్చామని తెలిపారు. తమను ఆదుకుంటామని చెప్పిన వైసీపీ నేతల మాటలు విశ్వసించి… నియోజకవర్గ ఇన్ ఛార్జి నంబూరి శంకరరావు సమక్షంలో పార్టీలో చేరామని… చివరకు కండువాలు వేసి, భోజనాలు పెట్టి పంపించారని మండిపడ్డారు.