TITA extends technology support to Kaleshwaram

ఈ నెల 24న కాళేశ్వరం వెట్‌ రన్‌ కు సన్నాహాలు

 

దేశంలోనే తెలంగాణలో అత్యంత అధునాతన సాంకేతికంగా, ఇంజనీరింగ్ పరంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మితమవుతున్న అందరి దృష్టిని ఆకర్శించిన కాళేశ్వరం డ్యామ్ నిర్మాణ పనులు చురుగ్గా సాగుతూ ట్రయల్ రన్ కు వేగంగా సిద్దమవుతుండడంపట్ల అందరిలో ఆసక్తి నెలకొంది. యావత్ దేశాన్ని ఆశ్చర్యపరుస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకం చివరి అంకానికి చేరుకుంది. ఈ వర్షాకాలంలోనే కాళేశ్వరం నీటిని చెరువులకు మళ్లించాలన్న సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతుంది. ఎల్లంపల్లి జలాశయం నుంచి గ్రావిటీ కాల్వలోకి విడుదల చేసిన నీరు.. నంది మేడారం పంపుహౌస్‌లోని సర్జ్‌ పూల్‌ కు చేరుతుంది. గోదావరి జలాలతో.. సర్జ్ పూల్ లో అంతకంతకు నీటిమట్టం పెరుగుతోంది. దీంతో ఏప్రిల్ 24న ప్రాజెక్టులోని భారీ మోటర్లను తొలిసారి వెట్ రన్‌ ద్వారా పరీక్షించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు.

మూడు రోజుల క్రితం ఎల్లంపల్లి జలాశయం నుంచి విడుదల చేసిన గోదావరి జలాలు.. సాంకేతికంగా ఎలాంటి సమస్య లేకుండా సాఫీగా సాగిపోయాయని అధికారులు నిర్ధారించుకున్నారు. దీంతో సర్జిపూల్ నింపే పనిలో నిమగ్నమయ్యారు. ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యావేక్షిస్తున్నరు. సర్జ్ పూల్ లో నీటిమట్టం 124.5 మీటర్లు దాటిందని అధికారులు తెలిపారు. 133 మీటర్లు నీరు చేరిన తర్వాత వెట్ రన్ కు మార్గం సాధ్యమవుతుందని ఇంజనీర్లు తెలిపారు. ప్రస్తుతం సర్జ్ పూల్ లో ప్రతీ గంటకు 0.6 మీటర్ల నీటిమట్టం పెరుగుతుంది.

Leave a Reply