నేరుగా గుడిలోకి వెళ్లలేదు... క్యూలైన్లో నడుస్తూ వెళ్లి వెంకన్నను దర్శించుకున్న జగన్!

ఈవీఎంలపై నెపం… తన ఓటమిపై తొలిసారి స్పందించిన పరిటాల శ్రీరామ్!

ఈవీఎంల కారణంగానే తెలుగుదేశం పార్టీ ఓడిపోయిందే తప్ప, ప్రజల గుండెల్లో పార్టీ స్థానం స్థిరంగా ఉందని పరిటాల సునీత కుమారరుడు పరిటాల శ్రీరామ్ వ్యాఖ్యానించారు. రామగిరిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, టీడీపీ ఓడిపోయిందనడంలో నిజం లేదని వ్యాఖ్యానించారు. తమ కుటుంబం ప్రజల కోసమే పని చేస్తోందని, గడచిన ఐదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేశామని అన్నారు. నియోజకవర్గంలోని గ్రామాలకు నీటి కొరత లేకుండా చూసేందుకు రూ. 200 కోట్లను ఖర్చు చేశామన్నారు. ఏ గ్రామాన్నీ పక్షపాతంతో చూడలేదని, పార్టీలకు అతీతంగా పనిచేశామని చెప్పారు.

వైసీపీ గెలవగానే గొడవలకు దిగుతున్నారని, ఇది సరికాదని పరిటాల శ్రీరామ్ అభిప్రాయపడ్డారు. తమ కుటుంబానికి అభిమానులు, ప్రజలు అండగా ఉన్నంతవరకూ ఎమ్మెల్యేలు, మంత్రులం తామేనని, అందరమూ ఓ కుటుంబంగా కలిసి ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. ఇక్కడే పుట్టిన తాము, ఇక్కడే బతుకుతామని, గ్రామాలను వదిలిపెట్టబోమని ప్రతిజ్ఞ చేశారు.