ఇండియాలో కశ్మీర్ ఉండదు: వైగో సంచలన వ్యాఖ్యలు

ఇండియాలో కశ్మీర్ ఉండదు: వైగో సంచలన వ్యాఖ్యలు

  • 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి భారత్ లో కశ్మీర్ ఉండదు
  • కశ్మీర్ పై బీజేపీ వాళ్లు బురద చల్లారు
  • గతంలో కూడా కశ్మీర్ పై నా అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాను

భారతదేశం 100వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకునే నాటికి భారత్ లో కశ్మీర్ ఉండదంటూ ఎండీఎంకే అధినేత వైగో సంచలన వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్ పై బీజేపీ వాళ్లు బురద చల్లారని మండిపడ్డారు. కశ్మీర్ విషయంలో కాంగ్రెస్ తప్పిదం కూడా ఉందని అన్నారు. కశ్మీర్ అంశంలో కాంగ్రెస్ ను తాను 30 శాతం తప్పుపడితే… బీజేపీని 70 శాతం తప్పుపడతానని చెప్పారు.

గతంలో కూడా కశ్మీర్ పై తన అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పానని అన్నారు. దివంగత ముఖ్యమంత్రి అన్నాదురై 110వ జయంతి ఉత్సవాలను తమ పార్టీ ఒక రోజంతా ఘనంగా నిర్వహస్తుందని వైగో తెలిపారు. వచ్చే నెలలో ఈ సంబరాలు ఉంటాయని చెప్పారు.