ఇండస్ట్రీలో క్యాస్టింగ్‌ కౌచ్‌ ఉంది: సీనియర్ నటుడు అర్జున్‌

క్యాస్టింగ్ కౌచ్ నూటికి నూరు శాతం నిజం
అయినా నా కూతురును సినిమాల్లో నటించకుండా ఆపలేను
ఎందుకంటే.. నా కూతురుపై నాకు నమ్మకం ఉంది
క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు సినీ పరిశ్రమను కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ అంశంపై ప్రముఖ హీరో అర్జున్ మాట్లాడుతూ… ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని స్పష్టం చేశారు. క్యాస్టింగ్ కౌచ్ అనేది నూటికి నూరు శాతం నిజమని చెప్పారు. అయితే దాన్ని దృష్టిలో ఉంచుకుని తన కూతురు ఐశ్వర్యను సినిమాల్లో నటించకుండా ఆపలేనని ఆయన అన్నారు. తన కూతురుపై తనకున్న నమ్మకమే దానికి కారణమని చెప్పారు. ఆ నమ్మకంతోనే ఐశ్వర్యకు సినిమాల్లో అవకాశాలు ఇప్పించానని తెలిపారు. 38 ఏళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న తానే సినీ రంగాన్ని నమ్మకపోతే, మరెవరు నమ్ముతారని అన్నారు.