ఆ వార్తలో నిజం లేదంటోన్న కీర్తి

25న ‘భరత్ అనే నేను’ తమిళ వెర్షన్ విడుదల
‘కాశి’గా వస్తున్న ‘బిచ్చగాడు’ హీరో!
* తాజాగా ‘మహానటి’ సినిమాలో సావిత్రి పాత్ర పోషించి ప్రశంసలు అందుకున్న అందాలతార కీర్తి సురేశ్.. త్వరలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ లో కూడా నటిస్తున్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, ఇందులో ఏమాత్రం వాస్తవం లేదని, ఆ సినిమా విషయంలో తననెవరూ సంప్రదించలేదని కీర్తి వివరణ ఇచ్చింది.
* మహేశ్ బాబు హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘భరత్ అనే నేను’ చిత్రాన్ని తమిళంలోకి కూడా అనువదిస్తున్నారు. ‘భరత్ యనుమ్ నాన్’ పేరిట డబ్ అవుతున్న ఈ చిత్రాన్ని తమిళ నాట ఈ నెల 25న రిలీజ్ చేస్తారు.
* ‘బిచ్చగాడు’ ఫేం విజయ్ ఆంటోనీ నటించిన తాజా చిత్రం ‘కాశి’. కృత్తిక ఉదయనిది దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో అంజలి, సునయన హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ఈ నెల 18న విడుదల చేస్తున్నారు.