కొంతకాలం క్రితం ప్రభుదేవా - తమన్నా ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు విజయ్ 'దేవి' సినిమాను తెరకెక్కించాడు. హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో 'అభినేత్రి' పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ వసూళ్లతో రెండు భాషల్లోను విజయాలను అందుకుంది.

ఆసక్తిని రేపుతోన్న ‘దేవి 2’ టీజర్

కొంతకాలం క్రితం ప్రభుదేవా – తమన్నా ప్రధాన పాత్రధారులుగా దర్శకుడు విజయ్ ‘దేవి’ సినిమాను తెరకెక్కించాడు. హారర్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా తెలుగులో ‘అభినేత్రి’ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ వసూళ్లతో రెండు భాషల్లోను విజయాలను అందుకుంది. అలాంటి ఈ సినిమాకి సీక్వెల్ గా ‘దేవి 2’ సినిమాను నిర్మించారు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు.

ప్రభుదేవా .. తమన్నా .. నందిత శ్వేత .. కోవై సరళ వంటి ప్రధానమైన పాత్రలపై కట్ చేసిన టీజర్ ఆసక్తిని రేకెత్తిస్తోంది. సస్పెన్స్ తో కూడిన ఈ హారర్ మూవీకి సక్సెస్ అయ్యే లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. ఇక ఏప్రిల్ 19న లారెన్స్ ‘కాంచన 3’ రానుంది. ప్రభుదేవా .. లారెన్స్ కొరియోగ్రఫర్స్ గా .. దర్శకులుగా .. నటులుగా రాణించినవారే. అలాంటి ఈ ఇద్దరూ హారర్ కాన్సెప్ట్స్ తో చాలా తక్కువ గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం విశేషం