ఆమంచి, అవంతిలపై విరుచుకుపడిన మంత్రి చినరాజప్ప

ఆమంచి, అవంతిలపై విరుచుకుపడిన మంత్రి చినరాజప్ప

టీడీపీని వీడి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన నేతలు ఆమంచి కృష్ణ మోహన్, అవంతి శ్రీనివాస్‌లపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి చినరాజప్ప నిప్పులు చెరిగారు. ఎన్నికల సమయంలో పార్టీ మారడం వారిద్దరికీ వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు. ఆమంచికి సిగ్గులేదని, అవంతికి విశ్వాసం లేదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రిజర్వేషన్లు సాధ్యం కాదన్న జగన్‌ పంచన చేరడం వారి దిగజారుడు తనానికి నిదర్శనమన్నారు. చంద్రబాబును విమర్శించే అర్హత వారిద్దరికీ లేదని మంత్రి పేర్కొన్నారు.