ఆగస్టు 31 వరకూ ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు గడువు పొడిగింపు

ఆదాయపు పన్ను రిటర్న్‌ల దాఖలు గడువును కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి (సీబీడీటీ) పొడిగించింది. 2018-19 సంవత్సరానికి సంబంధించి… ‘ఆడిట్‌ అవసరంలేని పన్ను చెల్లింపుదారులు’ ఆగస్టు 31 వరకూ రిటర్న్‌లను దాఖలు చేసుకోవచ్చని ఆర్థికశాఖ గురువారం ఓ ప్రకటనలో వెల్లడించింది.