ఆంధ్ర ప్రదేశ్లో తెలుగు దేశం పార్టీకి మళ్ళీ జీవం పోస్తున్న జగన్ సిర్కార్ .

పల్నాడు సంఘటనతో తెలుగు దేశం పార్టీకి మళ్ళి ఉపిరి వస్తోందా అన్న ప్రశ్న ఉదయిస్తోంది .బుధవారం నాడు రాష్ట్రవ్యాప్తంగా వున్నా తెలుగుదేశం నాయకులను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడం, ప్రతిపక్ష నాయకుడుచంద్రబాబును సైతం ఉండవిల్లి ఇంటివద్ద నిర్బంధించడం వంటి చర్య ద్వారా జగన్ ప్రభుత్వము దేశం పార్టీకి క్యాడర్ స్థాయినుంచి బలోపేతం అయ్యే పరిస్థితిని కలిగించిన
విధంగా కనిపిస్తోంది . ఈ సంఘటనలని విశ్లేషిస్తుంటే బీజేపీకి ఎక్కువ నష్టం కలిగేలా కనిపిస్తోంది . ప్రస్తుత బిజెపి నాయకత్వము అధికారంలో వున్నా వైస్సార్సీపీ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఆంధ్ర ప్రదేశ్ లో ఎదగాలని చూస్తోంది. పల్నాడు సంఘటనతో తెలుగు దేశం క్యాడరకు మళ్ళీ చంద్రబాబు నాయకత్వం పై నమ్మకం పెరుగుతోంది . ఫలితంగా దేశం పార్టీ నుంచి బిజెపి లోకి వలసలు తగ్గే అవకాశం వుంది. మొన్నటి ఎన్నికల్లలో 23 స్థానాలకే పరిమితమైన టీడీపీ ఇక పై కోలుకోలేదని భావించిన కొంతమంది నాయకులు, కింది స్థాయి కార్యకర్తలూ తెలుగుదేశం పార్టీని వీడి బిజెపి లోకి చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వార్తలు వస్తున్న నేపధ్య o లో చంద్రబాబు పార్టీని ముందుకు తీసుకువెళ్లగలరన్న ధీమా, భరోసా వచ్చిందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి