అరవింద ఇంట్లో రాఘవుడి సందడి

త్రివిక్రమ్‌ సినిమా అంటే సకుటుంబ సపరివార సమేతంగా చూడగలిగేలా ఉంటుంది. వినోదం, కుటుంబ బంధాలు, యాక్షన్‌… ఇవన్నీ కలిపిన ఫ్యామిలీ ప్యాక్‌. ఈసారీ అలాంటి కథతోనే రాబోతున్నారు. ఎన్టీఆర్‌ కథానాయకుడిగా త్రివిక్రమ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’. పూజా హెగ్డే కథానాయిక. రాధాకృష్ణ నిర్మాత. హైదరాబాద్‌ శివార్లలో చిత్రీ కరణ జరుగుతోంది. కథానాయిక ఇంటికి సంబంధించిన సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. దాదాపుగా ప్రధాన తారాగణం మొత్తం పాల్గొంటోంది. తమన్‌ ఈ చిత్రానికి స్వరకర్త. ఈ దసరాకి ఈ చిత్రాన్ని విడుదల చేయాలన్నది దర్శక నిర్మాతల ఆలోచన. రాయలసీమ నేపథ్యంలో సాగే కథ ఇది. సంభాషణలు ఆ యాసలోనే వినిపించబోతున్నాయి. త్రివిక్రమ్‌కి రాయలసీమ యాసలో డైలాగులు రాయడం కొత్త. కాబట్టి ఈసారి ఆయన డైలాగులు ఇంకాస్త కొత్తగా వినిపించనున్నాయి.