అభివృద్ధిని అడ్డుకోవడమే మహాకూటమి లక్ష్యం: ఎంపీ బాల్క సుమన్

అభివృద్ధిని అడ్డుకోవడమే మహాకూటమి లక్ష్యం: ఎంపీ బాల్క సుమన్

తెలంగాణ అభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారని, ఆ అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా మహాకూటమి పెట్టుకుందని టీఆర్ఎస్ ఎంపీ బాల్కసుమన్ మండిపడ్డారు. నిరుద్యోగ యువతకు రూ.3016 భృతి ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తూ వరంగల్ లోని ఏకశిలా పార్క్ నుంచి అమరవీరుల స్థూపం వరకు యువత భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎంపీలు బాల్కసుమన్, పసునూరి దయాకర్, వరంగల్ పశ్చిమ నియోజకవర్గం టీఆర్ఎస్ అభ్యర్థి వినయ్ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా బాల్క సుమన్ మాట్లాడుతూ, తెలంగాణ ప్రజల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని, ఇవ్వని హామీలను కూడా కేసీఆర్ అమలు చేశారని అన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా రైతులకు ఇరవై నాల్గు గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని, రైతులు అడగకుండానే పెట్టుబడి నిమిత్తం ఎకరానికి రూ.8 వేలు పెట్టుబడిగా అందిస్తున్నామని చెప్పారు.