అతి విశ్వాసం కాదు.. ఆత్మ విశ్వాసం: సజ్జల

అతి విశ్వాసం కాదు.. ఆత్మ విశ్వాసం: సజ్జల

అన్ని రాజకీయ పార్టీల మాదిరిగానే వైఎస్సార్‌సీపీ ఎన్నికలకు సిద్దమవుతోందని.. తమది అతి విశ్వాసం కాదని.. ఆత్మ విశ్వాసమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడి​ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీని వ్యవస్థాగతంగా బలోపేతం చేసుకునేందుకు గ్రామస్థాయి నుంచి ప్రతి ఒక్కరినీ సమాయత్తం చేస్తున్నామన్నారు. వారందరికీ వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి దిశానిర్దేశం చేసి కార్యోన్ముఖులుగా చేస్తారని పేర్కొన్నారు.

అన్ని రకాల ఎత్తుగడలు, చేయరాని పనులన్నీ చేసి చంద్రబాబు గద్దెను ఎక్కారని, ఇప్పటికీ ఆయనలో మార్పు లేదని విమర్శించారు. కొత్తగా ఏర్పడినా.. మూడు నాలుగు దశాబ్దాల వరకు నిలబడేలా పార్టీని జగన్‌మోహన్‌ రెడ్డి బలోపేతం చేస్తున్నారని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో 150వరకు సీట్లు సంపాదిస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.