అడ్డంగా బుక్కయ్యిన అనిల్ కుమార్ యాదవ్.!

అడ్డంగా బుక్కయ్యిన అనిల్ కుమార్ యాదవ్.!

రాజకీయ రంగంలో నాయకులుగా ఎదగాలి అంటే వారికి ఉండాల్సిన అనేక లక్షణాల్లో వాక్చాతుర్యం అతి కీలకమైనది.తమ అద్భుత ప్రసంగాలతో మాటలతో ప్రజలను ఆకర్షితులను చేసుకునే నాయకులే ఒక్కోసారి వారి మాటల వల్ల అదే ప్రజల్లో నవ్వుల పాలవుతారు.ఈ బెడద పెద్ద పెద్ద రాజకీయ నాయకులకే తప్పలేదు.ఇప్పుడు ఇలాంటి ఒక ఘటనే వైసీపీకు చెందిన అగ్రెసివ్ ఎమ్మెల్యే మరియు నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ యాదవ్ విషయంలో జరిగింది.తాను మాట్లాడుతూ మాట్లాడుతూ ఒకటి చెప్పబోయి ఇంకొకటి చెప్పి అడ్డంగా బుక్కయ్యిపోయాడు.

తాజగా ఆంధ్ర రాష్ట్రంలో కరకట్ట ప్రాంతం అంతటిని వరదలు ముంచెత్తుతున్న సంగతి అందరికి తెలిసిందే.దీనిపై మాట్లాడుతూ ఎనిమిది ఇంటూ నాలుగు క్యూసెక్కులు నీరు కలిపితే పన్నెండు క్యూసెక్కులు అని మాట జారీ బుక్కయ్యిపోయారు.దీనితో ఇక సోషల్ మీడియాలో అనిల్ ను ఒక రేంజ్ లో నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు.ఇన్నాళ్ల నుంచి ఎనిమిది నాలుగులు అంటే 32 అనుకున్నామని కానీ అనిల్ గారు చెప్పినట్టు పన్నెండు అని తెలుకోలేకపోయామని ఇప్పటి వరకు ఒక లెక్క ఇప్పటి నుంచి ఒక లెక్క అంటూ ఓ రేంజ్ లో అనిల్ పై జోకులు వేసుకుంటున్నారు.