మాజీ మంత్రి సత్యారావు మృతికి సీఎం జగన్ సంతాపం

రైతు భరోసా సాయం రూ 13,500 :అగ్రికల్చర్‌ మిషన్‌పై సీఎం జగన్‌ సమీక్ష

 అగ్రికల్చర్‌ మిషన్‌పై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి అమలుకానున్న వైఎస్సార్‌ రైతు భరోసా పథకంపై, ధరల స్థిరీకరణ నిధి, రబీ సాగు కార్యాచరణపై రైతు సంఘాల ప్రతినిధులతో చర్చించారు. వర్షాలు ఆలస్యంగా కురిసినందున పంటలు దెబ్బతిన్నాయని రైతు సంఘాల ప్రతినిధులు ఈ సందర్భంగా సీఎం దృష్టికి తీసుకొచ్చారు. ఖరీఫ్‌ స్థాయిలో సాగు లేదని చెప్పారు.

రైతు భరోసా.. రూ. 5,510 కోట్లు విడుదల
రైతు భరోసా పథకాన్ని ఈ నెల 15న నెల్లూరు సమీపంలోని కాకుటూరులో సీఎం వైఎస్‌ జగన్‌ ప్రారంభించనున్నారు. 15వ తేదీ ఉదయం 10.30 గంటలకు విక్రమసింహపురి విశ్వవిద్యాలయ ప్రాంగణానికి సీఎం చేరుకుంటారు. ఆ తర్వాత కౌలు రైతులకు కార్డులు పంపిణీ చేస్తారు. రైతులకు రైతుభరోసా కింద వ్యవసాయ పెట్టుబడి సాయంగా చెక్కులు పంపిణీ చేయనున్నారు. అనంతరం బహిరంగసభలో సీఎం ప్రసంగించనున్నారు. ఈ నేపథ్యంలో రైతు భరోసా పథకానికి రూ. 5,510 కోట్లను విడుదల చేస్తూ ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. రైతులకు ఇచ్చే పెట్టుబడి సాయాన్ని ఆయా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. ఆ డబ్బులను బ్యాంకులు ఇతర బకాయిలకు జమ చేసుకోవడానికి వీలు ఉండదు. ఇప్పటికే ఈ విషయాన్ని ముఖ్యమంత్రి పలుసార్లు స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

Leave a Reply