నాదెండ్ల మనోహర్ సమక్షంలో జనసేనలో చేరిన పలువురు నేతలు

అఖిలపక్ష సమావేశంపై ఉండవల్లి లేఖపై స్పందించిన చంద్రబాబు

  • · విజయవాడలో రేపు ఉండవల్లి ఆధ్వర్యంలో అఖిలపక్ష సమావేశం
  • · సమావేశానికి హాజరవుతామని చెప్పిన చంద్రబాబు
  • · టీడీపీతో కలిసి ఒకే వేదికను పంచుకోలేమన్న వైసీపీ

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో రేపు విజయవాడలోని ఐలాపురం హోటల్ లో అఖిలపక్షం, మేధావుల సమావేశం జరగనుంది. ఈ భేటీలో ప్రత్యేక హోదా, విభజన హామీలు, రాష్ట్రానికి కేంద్రం నిధులు ఇవ్వకపోవడం తదితర అంశాలపై చర్చించనున్నారు. ఈ సమావేశానికి హాజరు కావాలంటూ ఇప్పటికే అన్ని పార్టీలను ఉండవల్లి లేఖ రాశారు.

ఈ లేఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు స్పందించారు. ఉండవల్లి నిర్వహిస్తున్న సమావేశానికి హాజరు కావాలని నిర్ణయించామని ఆయన తెలిపారు. ఈ భేటీకి ఎంపీ సీఎం రమేష్, మంత్రి నక్కా ఆనందబాబులు హాజరవుతారని చెప్పారు.

మరోవైపు, ఈ భేటీకి హాజరుకాలేమని వైసీపీ ప్రకటించింది. టీడీపీతో కలసి ఒకే వేదికను పంచుకోలేమని తమకు వైసీపీ నాయకత్వం తెలిపిందని ఉండవల్లి చెప్పారు. మిగిలిన పార్టీలన్నీ హాజరుకానున్నాయని తెలిపారు.